ఆత్మహత్య చేసుకున్న ప్రేమోన్మాది ఢిల్లీ బాబు
Delhi Babu Commit For Suicide. ప్రేమోన్మాది కత్తితో దాడి చేయడంతో యువతి ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటనకు పాల్పడిన ఢిల్లీబాబు ఆత్మహత్య.
By Medi Samrat
ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఢిల్లీబాబు పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న ప్రేమోన్మాది ఢిల్లీ బాబు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతిని హత్య చేసిన అనంతరం పరారైన ఢిల్లీబాబు గురువారం తూర్పుపల్లి అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తూ ఉన్నారు.
పనుమూరు మండలం ఎంపర్ల కొత్తూరుకు చెందిన ఢిల్లీ బాబు, గాయత్రి అనే ప్రేమజంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికి గాయత్రి మైనర్ కావడంతో ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. అప్పటినుంచి గాయత్రి ప్రియుడు ఢిల్లీబాబును దూరం పెడుతూ వచ్చింది. ఇది జీర్జించుకోలేని యువకుడు ప్రియురాలు గాయత్రిపై ద్వేషం పెంచుకొని ఆమెపై 15 సార్లు కత్తితో దాడిచేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో గాయత్రి మృతి చెందింది.