Hanamkonda: హాస్టల్‌లో ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  12 Jan 2024 3:58 PM IST
degree student, suicide,  hanamkonda, telangana,

 Hanamkonda: హాస్టల్‌లో ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య 

హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో విషాదం చోటుచేసుకుంది. డిగ్రీ విద్యార్థిని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. అయితే.. ఆమె హాస్టల్‌ రూములో ఎవరూ లేని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలో కలకలం సృష్టించింది.

హసన్‌పర్తిలోని ఎస్సార్‌ యూనివర్సిటీలో దీప్తి అనే విద్యార్థిని బీఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతోంది. ఈమె మంచిర్యాలకు చెందిన ఈమె హసన్‌పర్తికి వచ్చి చదువుకుంటోంది. హన్మకొండలోని ఎస్సార్‌ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతోంది. క్యాంపస్ హాస్టల్‌లోనే ఉంటోంది. అయితే.. ఉన్నట్లుండి ఆ యువతి హాస్టల్‌లోని గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు కాసేపటికి వచ్చి చూసే సరికి ప్రాణాలు కోల్పోయి ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది. దాంతో.. దీప్తిని చూసి వారంతా షాక్‌ అయ్యారు. వెంటనే యూనివర్సిటీ యాజమాన్యానికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న యాజమాన్యం.. దీప్తిని చూసిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు హాస్టల్‌ గదిలోకి వెళ్లి పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు.

అయితే దీప్తి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రేమ వ్యవహారం, పరీక్షా ఫలితాలే కారణమని అనుమానిస్తున్నారు. కాగా.. దీప్తి తన క్లాస్‌మేట్‌ యువకుడిని ప్రేమిస్తున్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయట. ఇక ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాల్లో దీప్తి ఒక్క సబ్జెట్‌ మినహా అన్నింట్లోనూ ఫెయిల్‌ అయ్యిందని తెలుస్తోంది. ఈ రెండు కారణాల వల్లే దీప్తి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని వివరాలు సమగ్ర విచారణ తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.

Next Story