ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం.. హత్య చేశారంటున్న కుటుంబ సభ్యులు
Dead Body found in MLC Anantha Babu Car.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం
By తోట వంశీ కుమార్ Published on
20 May 2022 4:47 AM GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు కారులో యువకుడి మృతదేహం బయటపడింది. మృతుడిని గతంలో ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన సుబ్రమణ్యంగా గుర్తించారు.
గురువారం సుబ్రమణ్యంను ఎమ్మెల్సీ తనతో పాటు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి రోడ్డు ప్రమాదంలో అతడు మరణించాడని డ్రైవర్ తమ్ముడికి ఎమ్మెల్సీ సమాచారం ఇచ్చారు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన కారులోనే మృతదేహాన్ని ఎమ్మెల్సీ బాబు తీసుకొచ్చి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే.. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో అనంతబాబు కారును అక్కడే వదిలివేసి.. అక్కడి నుంచి వేరే కారులో వెళ్లిపోయారు. కాగా.. సుబ్రహ్మణ్యంను హత్య చేశారంటూ అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేపట్టి దర్యాప్తు చేపట్టారు.
Next Story