తండ్రి చితిలో దూకిన కుమారై..!

Daughter jumped in father's pyre.తాజాగా.. ఓ వ్య‌క్తి క‌రోనా బారిన ప‌డి మృతి చెంద‌గా.. తండ్రి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని అత‌డి కుమారై.. తండ్రి చితిలో దూకేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2021 3:32 AM GMT
pyre

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అనే తేడాలేకుండా అంద‌రికి ఈ మ‌హ‌మ్మారి సోకుతోంది. ఎంతో మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబ పెద్ద‌ల‌ను కోల్పోయిన ఆ కుటుంబాల బ‌తుకులు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఎన్నో విషాద‌క‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. ఓ వ్య‌క్తి క‌రోనా బారిన ప‌డి మృతి చెంద‌గా.. తండ్రి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని అత‌డి కుమారై.. తండ్రి చితిలో దూకేసింది. అక్క‌డే ఉన్న కుటుంబ స‌భ్యులు ఆమెను కాపాడి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. తీవ్రగాయాల‌తో ప్ర‌స్తుతం ఆ యువ‌తి చికిత్స పొందుతోంది. ఈ విషాద ఘ‌ట‌న రాజ‌స్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

బార్మెర్ జిల్లా కేంద్రంలోని రాయ్ కాలనీలో దామోదర్ దాస్ అనే వ్య‌క్తి త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. ఇటీవ‌ల అత‌ను క‌రోనా బారిన ప‌డ‌గా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అత‌డి అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాటు చేశారు. శ్మ‌శానంలో చితికి నిప్పంటించారు. ఈ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న అత‌డి కుమారై చంద్ర శార‌ద‌(30) తండ్రి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక.. చితిలో దూకేసింది. ప‌క్క‌నే ఉన్న ఆమె సోద‌రి.. ర‌క్షించేందుకు యత్నించింది. గ‌మ‌నించిన మిగ‌లిన వారు వ‌చ్చి సాయం చేశారు. అయితే.. అప్ప‌టికే చంద్ర శార‌ద తీవ్రంగా గాయ‌ప‌డింది.

కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్షించిన డాక్ట‌ర్లు ఆమె శ‌రీరం 70శాతానికి పైగా కాలిపోయింద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలిపారు. దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఆస్ప‌త్రికి చేరుకున్నారు. అక్క‌డి వైద్య సిబ్బందిని వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. కాలిన గాయాల‌తో బాధ‌ప‌డుతున్న‌ మహిళ స్టేట్‌మెంట్ ఇచ్చే స్థితిలో లేదని పోలీసు అధికారి ఆనంద్ సింగ్ తెలిపారు.




Next Story