సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంటూ.. నిరుద్యోగిని నిలువునా ముంచినా సైబర్‌ చీటర్స్‌

సైబర్ నేరగాళ్లు ఓ నిరుద్యోగిని టార్గెట్‌గా చేసుకొని ఒక వెబ్‌సైట్‌ ద్వారా ఈ మెయిల్‌ని పంపించి సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా రూ. 4.5 లక్షల జీతం అంటూ ఎర వేశారు

By అంజి
Published on : 7 July 2023 10:58 AM IST

Cyber ​​criminals, software job, Hyderabad

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంటూ.. నిరుద్యోగిని నిలువునా ముంచినా సైబర్‌ చీటర్స్‌

హైదరాబాద్ నగరంలో రకరకాల సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ.. మెసేజ్లను కానీ రిసీవ్ చేసుకుని ఇబ్బందులకు గురి కాకూడదు అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. అయినా కూడా అమాయకమైన జనం సైబర్ నేరగాళ్లను నమ్మి లక్షలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళే సైబర్ మోసగాళ్ల మాయమాటలు నమ్మి వారి ఉచ్చులో చిక్కుకొని డబ్బులను కోల్పోతున్నారు.

తాజాగా సైబర్ నేరగాళ్లు ఓ నిరుద్యోగిని టార్గెట్‌గా చేసుకొని ఒక వెబ్‌సైట్‌ ద్వారా ఈ మెయిల్‌ని పంపించి సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా రూ. 4.5 లక్షల జీతం అంటూ ఎర వేశారు.. ఇంకేముంది ఆ నిరుద్యోగి వారి ఉచ్చలో చిక్కుకున్నాడు. దీంతో సైబర్ చీటర్స్ ఉద్యోగం వచ్చిందంటూ ఆ నిరుద్యోగిని మాయమాటలు చెప్పి అతని వద్ద నుండి మెల్లిగా 86,000 వసూలు చేశారు. అనంతరం వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించి ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

హైదరాబాద్‌కు చెందిన తేజ వీర బ్రహ్మ కుమార్ అనే యువకుడికి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా రూ.4.5 లక్షల జీతం అంటూ నౌకరీ ఫాస్ట్ సర్వీసెస్ అనే వెబ్‌సైట్ ద్వారా ఒక ఈమెయిల్ వచ్చింది. అది నిజమని నమ్మిన బాధితుడు వారిని కాంటాక్ట్ చేశాడు. వారు ఉద్యోగం వచ్చిందని హెచ్ ఆర్ ప్రాసెస్ కి 15000, సర్వీస్ కి 22,200 బాధితుడు దగ్గర నుండి వసూలు చేశారు. ఇలా రకరకాల ప్రాసెస్ చెప్పి అతని వద్ద నుండి డబ్బులు అడుగుతూ ఉండడంతో బాధితుడికి అనుమానం వచ్చి విసిగిపోయి తన డబ్బులు తనకి ఇవ్వమని వారితో వాగ్వివాదానికి దిగాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి వెంటనే బాధితుడు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story