రూ.400 కోట్ల మోసం.. పోలీసుల కస్టడీలో సైబర్‌ చీటర్‌ రోనాక్‌ భరత్

అమాయక ప్రజలను మోసం చేసి వారి వద్ద నుండి వసూలు చేసిన 400 కోట్లు డబ్బులను చైనాకు తరలించిన సైబర్ చీటర్ రోనాక్‌ భరత్‌ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

By అంజి  Published on  25 Aug 2023 6:12 AM GMT
Cyber ​​cheater, Ronak Bharat,  Hyderabad police

రూ.400 కోట్ల మోసం.. పోలీసుల కస్టడీలో సైబర్‌ చీటర్‌ రోనాక్‌ భరత్ 

అమాయక ప్రజలను మోసం చేసి వారి వద్ద నుండి వసూలు చేసిన 400 కోట్లు డబ్బులను చైనాకు తరలించిన సైబర్ చీటర్ ఎట్లకేలకు పోలీసుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక నిందితుడు అయినా రోనాక్ భరత్ కాకడేను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్ లలో ఇన్వెస్ట్మెంట్ పేరుతో అమాయకమైన జనాలకు గాలం వేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులను వసూలు చేశాడు. ఆ విధంగా వసూలు చేసిన 400 కోట్ల రూపాయలను విదేశాలకు తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ నిందితుడిపై దేశవ్యాప్తంగా వందకు పైగా కేసులు నమోదై ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పేరుతో అమాయకమైన జనాలను బుట్టలో దింపి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసేవాడు. అంతేకాకుండా కొందరు ఏజెంట్లను నియమించి నకిలీ అకౌంట్లు ఓపెన్ చేయించాడు. ఈ విధంగా సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన డబ్బులను ఫేక్ అకౌంట్‌లోకి బదిలీ చేసేవారు.

అనంతరం ఈ అకౌంట్స్ ద్వారా చైనా, తైవాన్ దేశాలకు బిట్ కాయిన్స్ రూపంలో ట్రాన్స్‌ఫర్ర్ చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు అయినా భరత్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కోర్టును కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాద ప్రతివాదములు విన్న అనంతరం కోర్టు రెండు రోజులు పాటు కస్టడీ కీ అనుమతించింది. ఇదిలా ఉండగా మరోవైపు హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ అకౌంట్స్ చేసే ఏజెంట్లను గుర్తించారు. అలాగే చైనాకు చెందిన ప్రధాన నిందితుల పై ఆరాతీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసులు వివిధ బ్యాంక్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఒక ప్రధాన బ్యాంకులో 12 అకౌంట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కోర్ట్ అనుమతితో కస్టడీలోకి తీసుకున్న నిందితుడు భరత్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల కస్టడీ తర్వాత మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Next Story