ఈ నెల 21 వరకు పోలీస్ కస్టడీకి ముంబై అత్యాచార నిందితుడు
Court sends accused to Police custody till 21st September. ముంబైలో అత్యాచారానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ఈ ఉదయం
By Medi Samrat Published on 11 Sep 2021 11:19 AM GMT
ముంబైలో అత్యాచారానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ఈ ఉదయం మరణించింది. 34 సంవత్సరాల మహిళపై గురువారం రాత్రి కొందరు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మర్మావయాల్లో ఇనుప రాడ్ జొప్పించి పైశాచిక ఆనందం పొందారు. ముంబై శివార్లలోని సకినాక ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఖైరానీ రోడ్డులో ఓ మహిళను ఓ వ్యక్తి కొడుతున్నాడని చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూసేసరికి బాధితురాలు రక్తపు మడుగులో పడివుంది. దాంతో అమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఇవాళ మృతి చెందింది.
మహిళ పడి ఉన్న ప్రదేశంలో రోడ్డు పక్కనే ఉన్న టెంపో వ్యాన్‌ను పరిశీలించగా అందులో రక్తపు మరకలు కనిపించాయి. కేసుకు సంబంధించి మోహన్ చౌహాన్ (45) అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు బాధితురాలు మరణించడంతో ఆ కేసును అత్యాచారం, హత్యగా మార్చారు. మోహన్ చౌహాన్‌కు సిటీ కోర్టు ఈ నెల 21 వరకు పోలీస్ కస్టడీ విధించింది. సత్వర విచారణ కోసం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయనున్నట్లు ముంబై పోలీసులు తెలిపాయి. ముంబై శివార్లలోని సకినాక ఏరియాలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ టెంపో వ్యాన్‌లో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.