ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంప‌తుల దారుణ‌ హ‌త్య

Couple Murdered In Nalgonda. ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంప‌తుల దారుణ‌ హ‌త్య

By Medi Samrat  Published on  19 April 2021 3:33 AM GMT
couple murder

న‌ల్గొండ‌ జిల్లాలోని నేరుడుగొమ్ము మండ‌లం బుగ్గ‌తండాలో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంపతుల‌ను గుర్తుతెలియ‌ని దుండగులు దారుణంగా నరికి హ‌త్య చేశారు. వివ‌రాళ్లోకెళితే.. నేరుడుగొమ్ము మండ‌లంలోని బుగ్గ‌తండాకు చెందిన బుల్లి, నేనావ‌త్ సోమాని.. భార్యభ‌ర్త‌లు. ఆదివారం రాత్రి వారు త‌మ ఇంటి ఆరుబ‌య‌ట నిద్రిస్తుండ‌గా గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు వారిని హ‌త్య చేశారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. దంప‌తుల హ‌త్య‌కు భూవివాదాలే కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు. హ‌త్య‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.


Next Story
Share it