15 నెలల బిడ్డను చంపిన జంట.. ఆపై పోలీసులకు దొరకొద్దని కిడ్నాప్‌ నాటకం

ముంబైలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఓ జంట దారుణానికి ఒడిగట్టింది. 15 నెలల చిన్నారిని హత్య చేసి, ఆపై పసిబిడ్డను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు తప్పుడు నివేదిక అందించారు.

By అంజి  Published on  26 May 2024 3:12 PM IST
Mumbai, kidnap, Crime

15 నెలల బిడ్డను చంపిన జంట.. ఆపై పోలీసులకు దొరకొద్దని కిడ్నాప్‌ నాటకం 

ముంబైలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఓ జంట దారుణానికి ఒడిగట్టింది. మహిళ యొక్క 15 నెలల చిన్నారిని హత్య చేసి, ఆపై పసిబిడ్డను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు తప్పుడు నివేదిక అందించిన కేసులో జంటను అరెస్టు చేశారు. వారి అరెస్టు తరువాత, కోర్టు నిందితులని మే 28 వరకు పోలీసు కస్టడీకి పంపింది. నిందితులను రాజేష్ రాణా (28), రింకీ దాస్ (23)గా గుర్తించారు. వీరిద్దరూ ఒడిశాకు చెందినవారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు నెలల క్రితం రింకీ తన చిన్నారితో కలిసి ముంబైకి వచ్చింది.

కూలీ పనులు చేసుకునే జంట.. నగరంలోని జోగేశ్వరి ప్రాంతంలోని ఓ నిర్మాణ స్థలంలో నివాసం ఉంటున్నారు. చిన్నారి అపహరణకు గురైందని దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది. అయితే, ఆ వ్యక్తి చిన్నారిని దారుణంగా కొట్టి చంపాడని తేలింది. చిన్నారిని చంపిన తర్వాత ఆపై ఆరే మిల్క్ కాలనీ సమీపంలోని డ్రెయిన్‌లో దంపతులు మృతదేహాన్ని పడేసినట్లు విచారణలో తేలింది.

Next Story