స్నేహితుడి భార్యపై అత్యాచారం.. దంపతుల ఆత్మహత్యాయత్నం
Couple Committed Suicide Attempt in Nellore District.ఇటీవల కాలంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు
By తోట వంశీ కుమార్ Published on 24 Jun 2022 7:58 AM ISTఇటీవల కాలంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోతున్న కామాంధులకు వావి-వరుసలు, చిన్న-పెద్ద అని తేడా కనిపించడం లేదు. స్నేహితుడి భార్యపై కన్నేశాడు ఓ నయవంచకుడు. క్రమంగా స్నేహితుడిని మద్యానికి బానిస అయ్యేలా చేశాడు. అనంతరం స్నేహితుడి భార్యకు మత్తు మందు ఇచ్చి పలు మార్లు అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటి సాయంతో దంపతులిద్దరిని బెదిరిస్తున్నాడు. దీంతో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతడికి ఇలియాజ్ అనే స్నేహితుడు ఉన్నాడు. పరిచయాన్ని అదునుగా తీసుకున్న ఇలియాజ్.. స్నేహితుడి భార్యపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అనుకున్నాడు. అందుకోసం ఓ పథకాన్ని రూపొందించుకున్నాడు. క్రమంగా స్నేహితుడిని మద్యానికి బానిస అయ్యేలా చేశాడు. ఆ తరువాత స్నేహితుడి భార్యకు మత్తు మందు ఇచ్చాడు. స్పృహ తప్పిపోయిన తరువాత ఆమె పై పలుమార్లు అత్యాచారం చేశాడు.
ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదరిస్తున్నాడు. దీంతో దంపతులిద్దరూ పురుగుల మందు తాగారు. తాము చనిపోవడానిక ఇలియాజ్ కారణమని సూసైడ్ నోటు రాశారు. సెల్ఫీ వీడియోలో దంపతులిద్దరూ తమ బాధను తెలియజేశారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.