కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌

Constable found dead with throat slit in Kanpur.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని బిల్హౌర్ పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2022 4:22 PM IST
కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని బిల్హౌర్ పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ ను అతి దారుణంగా హ‌త్య చేశారు. గురువారం తెల్లవారుజామున కానిస్టేబుల్ తన గదిలో శవమై కనిపించాడు. కానిస్టేబుల్‌ గొంతు నులిమి చంపడంతో శరీరం, మెడపై పలు గాయాలున్నాయి. మృతదేహాన్ని గదిలోకి లాక్కెళ్లి పడేసిన దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ కాన్పూర్ ఔటర్‌లో ఉన్న బ్రహ్మపురి ప్రాంతంలో మిగిలిన పోలీసులతో కలిసి ఉంటూ ఉండేవాడు. ఊహించని విధంగా అతడు చనిపోయి కనిపించాడు. మృతుడు ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ దేశ్ దీపక్‌గా గుర్తించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story