సూట్‌కేస్‌లో కాంగ్రెస్ కార్యకర్త డెడ్‌బాడీ.. కలకలం రేపుతోన్న ఘటన

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలోని బస్టాండ్ సమీపంలో శనివారం సూట్‌కేస్‌లో కాంగ్రెస్ కార్యకర్త మృతదేహాన్ని కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  2 March 2025 7:36 AM IST
Congress worker, body found in suitcase, Rohtak, Crime

సూట్‌కేస్‌లో కాంగ్రెస్ కార్యకర్త డెడ్‌బాడీ.. కలకలం రేపుతోన్న ఘటన

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలోని బస్టాండ్ సమీపంలో శనివారం సూట్‌కేస్‌లో కాంగ్రెస్ కార్యకర్త మృతదేహాన్ని కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో సంబంధం ఉన్న హిమాని నర్వాల్ (22) మరణంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సాంప్లా బస్ స్టాండ్ సమీపంలో ప్రయాణీకులు సూట్‌కేస్‌ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని సూట్‌కేస్ లోపల నార్వాల్ మృతదేహాన్ని కనుగొన్నారు. బాధితురాలి మెడపై దుప్పట్టా చుట్టి ఉందని, బాధితురాలి చేతులపై మెహందీ ఉందని పోలీసులు తెలిపారు. రోహ్తక్ విజయ్ నగర్ ప్రాంతానికి చెందిన నర్వాల్ ను దుప్పట్టాతో గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పీజీఐఎంఎస్ రోహ్‌తక్‌కు తరలించారు. మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, పార్టీ ఎమ్మెల్యే బిబి బాత్రాతో కలిసి ఉన్న అనేక ఫోటోలను నర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పరిణామంపై స్పందిస్తూ, బాత్రా ఈ విషయంపై సిట్ దర్యాప్తును డిమాండ్ చేశారు. నార్వాల్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారని అన్నారు. తాను, తన బృందం సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించామని సంప్లా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ విజేంద్ర సింగ్ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు కూడా ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడా మాట్లాడుతూ.. నర్వాల్ "అనాగరిక హత్య" వార్త "దిగ్భ్రాంతికరమైనది" అని అన్నారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. "రోహ్‌తక్‌లో కాంగ్రెస్ కార్యకర్త హిమాని నర్వాల్ దారుణ హత్య వార్త చాలా విచారకరం, దిగ్భ్రాంతికరం. మరణించిన వారి ఆత్మకు నా నివాళులు అర్పిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితిపై ఒక మచ్చ" అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు. "ఈ హత్యపై ఉన్నత స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి. ప్రభుత్వం బాధితుడి కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేయాలి. దోషులకు కఠినమైన శిక్ష విధించాలి" అని ఆయన అన్నారు.

Next Story