జ‌గిత్యాల‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య

జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.

By Kalasani Durgapraveen  Published on  22 Oct 2024 12:01 PM IST
జ‌గిత్యాల‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య

జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను కారుతో వెనుక నుంచి ఢీకొట్టి.. సంతోష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. కత్తిపోట్లకు గురైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలుస్తుంది. పాత కక్షలతోనే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతం లో సంతోష్ కు గంగారెడ్డి మధ్య అనేక సార్లు గొడవలు జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలుమార్లు సంతోష్ ఫై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రధాన అనుచరుడిగా గంగారెడ్డి ఉన్నారు. ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. గంగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story