విద్యార్థినిపై కోచింగ్ సెంటర్ ఉద్యోగి అత్యాచారం.. క్లాస్‌రూంలో బంధించి..

గురుగ్రామ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓ గ్రామంలో 18 ఏళ్ల విద్యార్థినిపై కంప్యూటర్‌ కోచింగ్‌ సెంటర్‌లో పని చేస్తున్న 38 ఏళ్ల ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  31 Aug 2023 7:30 AM IST
Coaching centre employee, student, Crime news, Gurugram

విద్యార్థినిపై కోచింగ్ సెంటర్ ఉద్యోగి అత్యాచారం.. క్లాస్‌రూంలో బంధించి..

గురుగ్రామ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓ గ్రామంలో 18 ఏళ్ల విద్యార్థినిపై కంప్యూటర్‌ కోచింగ్‌ సెంటర్‌లో పని చేస్తున్న 38 ఏళ్ల ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌ ఉద్యోగిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఉమేష్ యాదవ్‌ను మంగళవారం అరెస్టు చేసి బుధవారం సిటీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు వారు తెలిపారు. ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె కొంతకాలంగా యాదవ్ పనిచేసిన కోచింగ్ సెంటర్‌లో విద్యార్థిని.

“శనివారం, నేను కోచింగ్ సెంటర్‌కు చేరుకున్నప్పుడు, నిందితుడు నన్ను క్లాస్‌ అయిపోయిన తర్వాత సెంటర్‌లో బందీగా ఉంచి బలవంతంగా అత్యాచారం చేశారు.ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆదివారం మళ్లీ నాపై అత్యాచారం చేశాడు' అని ఫిర్యాదుదారు తెలిపారు. మొదట్లో ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేదని, ఆ తర్వాత మంగళవారం సాయంత్రం తనను పోలీస్ స్టేషన్‌కు తరలించిన తల్లిదండ్రులకు చెప్పినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం సహా ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మంగళవారం అర్థరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. అతడిని బుధవారం సిటీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పటౌడీ ఏసీపీ హరీందర్ కుమార్ తెలిపారు.

Next Story