అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్యకు గురైంది. బాధితురాలిని ట్రాన్స్‌జెండర్ దిపుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శింకోట మండలం బయ్యవరం కల్వర్ట్ కింద దుప్పటిలో చుట్టిన మృతదేహం స్థానికులకు కనిపించింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడి చేరుకుని చూడగా.. దుప్పటి లోపల కుడి చేయి, నడుం కింద భాగం, కాళ్లు ఉన్నాయి. అదే సమయంలో అనకాపల్లి డైట్ దగ్గర మరికొన్ని శరీర భాగాలు పోలీసులకు లభించాయి. సంచిలో ముఖ భాగం లభ్యమైంది. శరీరంపై పుట్టుమచ్చలు, ఆభరణాల ఆధారంగా దిపుగా పోలీసులు కనుక్కొన్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ కేసులోని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు అధికారులకు సీఎం చంద్రబాబు వివరించారు. మంగళవారమే నాడే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారుతో సీఎం మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఇవాళ ఉదయం మరోసారి అనకాపల్లి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఈ కిరాతకానికి ఒడిగట్టిన నిందితులకు త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు.