దారుణం.. 9వ త‌ర‌గ‌తి విద్యార్థిని పై 12 త‌ర‌గ‌తి విద్యార్థి లైంగిక దాడి

Class 9 girl abducted and dumped outside home in Rajasthan.మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2022 3:15 AM GMT
దారుణం.. 9వ త‌ర‌గ‌తి విద్యార్థిని పై 12 త‌ర‌గ‌తి విద్యార్థి లైంగిక దాడి

మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అర‌చేతిలో ఆధునిక సాంకేతిక అందుబాటులోకి రావ‌డంతో విద్యార్థులు దారి త‌ప్పుతున్నారు. అశ్లీల వీడియోలు చూస్తూ మాద‌క ద్ర‌వ్యాలు వినియోగిస్తూ యువ‌త అసాంఘిక కార్యక‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారు. 12వ త‌ర‌గ‌తి చదివే విద్యార్థి తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దివే బాలిక‌ను లంచ్ విరామంలో ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని దుర్గాపూర్ జిల్లాలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. బిచివారా గ్రామానికి చెందిన బాలిక స్థానిక పాఠ‌శాల‌లో 9 త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఈ నెల 24న లంచ్ విరామంలో బాలిక పాఠ‌శాల బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో అదే పాఠ‌శాల‌లో 12 త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థి బాలిక వ‌ద్ద‌కు వ‌చ్చాడు. త‌న‌తో మాట్లాడాల‌ని చెప్పి బ‌ల‌వంతంగా బైక్‌పై ఎక్కించుకుని అట‌వీప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్క‌డ విద్యార్థినిపై గంట‌ల త‌ర‌బ‌డి అత్యాచారం చేశాడు. అనంత‌రం బాలిక‌ను ఆమె ఇంటి వ‌ద్ద వ‌దిలివెళ్లాడు.

బాలిక‌కు తీవ్ర ర‌క్త‌స్రావం అవుతుండ‌డంతో బాలిక‌ త‌ల్లిదండ్రులు ఆస్ప‌త్రికి తీసుకెళ్‌లారు. అక్క‌డ త‌న‌పై జ‌రిగిన దారుణాన్ని బాలిక త‌ల్లిదండ్రుల‌కు తెలిపింది. వెంట‌నే బాలిక త‌ల్లిదండ్రులు బిచివారా పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడితో పాటు అత‌డికి స‌హ‌క‌రించిన స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

Next Story
Share it