మత్తు మందు ఇచ్చి పదోతరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
Class 10 student molested in Muzaffarnagar.దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు
By తోట వంశీ కుమార్ Published on 26 Dec 2021 12:57 PM ISTదేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా పదో తరగతి విద్యార్థినికి మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సామూహిక అత్యాచార ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌నగర్ జిల్లాకు ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ప్రతిరోజు లాగే గురువారం కూడా ఆ బాలిక ట్యూషన్‌కు బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో ఇద్దరు వ్యక్తులు బాలికను అడ్డగించారు. అనంతరం బాలికకు మత్తుమందు ఇచ్చి సద్పూర్ గ్రామ సమీపంలోకి అటవీప్రాంతంలోకి తీసుకువెళ్లారు. అక్కడ మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మొత్తం నలుగురూ ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంతసేపటికి బాలిక ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు.. స్థానికులతో కలిసి బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఓ చోట బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది.
మత్తు నుంచి తేరుకున్న అనంతరం తనపై జరిగిన దారుణానికి కుటుంబ సభ్యులకు వివరించింది. ఈ దారుణఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జనసత్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ బబ్లూ సింగ్ వర్మ తెలిపారు.