దారుణం.. హోటల్‌కు తీసుకువెళ్లి పదోతరగతి విద్యార్థిని పై సామూహిక అత్యాచారం
Class 10 Student molested in Gurugram Hotel.విద్యార్థినిని హోటల్‌కి తీసుకువెళ్లి ఐదుగురువ్యక్తులు సామూహికఅత్యాచారానికి
By తోట వంశీ కుమార్ Published on 1 Nov 2022 3:00 AM GMTఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ని హోటల్‌కి తీసుకువెళ్లి ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గురుగ్రామ్ పట్టణంలో శనివారం రాత్రి జరిగింది. ఐదుగురిలో ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
14 ఏళ్ల బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె దగ్గర్లోని పార్క్‌లో వాకింగ్‌కి వెళ్లి ఉంటుందని తల్లి భావించింది. అయితే.. ఎంతసేపటికి ఆమె రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి.. బాలిక కోసం చుట్టు పక్కల వెతకడం ప్రారంభించింది. అయినప్పటికీ లాభం లేకపోయింది. మరుసటి రోజు ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటికి సమీపంలో బాలిక కనిపించింది. అని బాధితురాలి తల్లి పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.
రాత్రంతా ఎక్కడ ఉన్నావని ప్రశ్నించగా.. తనను ఇద్దరు స్నేహితులు బైక్‌పై హోటల్‌కు తీసుకువెళ్లారని, అక్కడ ఆ ఇద్దరితో పాటు మరో ముగ్గురు మొత్తం ఐదుగురు కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తల్లితో చెప్పింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొంది.
దీంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది.IPC సెక్షన్లు 376-D (గ్యాంగ్ రేప్), 506 (క్రిమినల్ బెదిరింపు), మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం కింద ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యాచారాన్ని ధృవీకరించారు.
ఈ ఘటనపై పశ్చిమ డీసీపీ దీపక్ సహారన్ మాట్లాడుతూ.. ఇద్దరు నిందితులను సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.