దారుణం.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని కిడ్నాప్.. కారులో సామూహిక అత్యాచారం

Class 10 girl kidnapped and molested in moving car in Delhi.దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2022 9:16 AM IST
దారుణం.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని కిడ్నాప్.. కారులో సామూహిక అత్యాచారం

దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన దుండ‌గులు కారులో ఆ బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. వ‌సంత్ విహార్ లో 16 ఏళ్ల బాలిక త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. ఈ నెల 6న బాలిక త‌న స్నేహితురాలి ఇంటికి వెళ్లి తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో వసంత్ విహార్ మార్కెట్ వ‌ద్ద ఇద్ద‌రు యువ‌కులు బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి కారు ఎక్కించుకున్నారు. వారితో పాటు బాలిక స్నేహితుడు కూడా ఆ కారులో ఉన్నాడు. మ‌హిపాల్‌పూర్ స‌మీపంలోని ఓ మ‌ద్యం దుకాణం వ‌ద్ద కారును ఆపి మ‌ద్యం కొనుగోలు చేశారు. అనంత‌రం ఆ ప్రాంతం మొత్తం కారులో తిరిగారు. ఓ ఏకాంత ప్ర‌దేశంలో కారును ఆపి బాలిక‌కు బ‌ల‌వంతంగా మ‌ద్యం తాగించారు. బాలిక‌ను కొట్టి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం తెల్ల‌వారుజామున బాలిక‌ను ఆమె ఇంటి స‌మీపంలో వ‌దిలి వెళ్లారు.

రెండు రోజులు త‌రువాత బాలిక చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రి వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇద్ద‌రు నిందితుల‌తో పాటు బాలిక స్నేహితుడిని కూడా అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story