భారత్ లో చైనా గూఢచారి.. 1300 సిమ్ కార్డులు చైనాకు..
Chinese spy arrested in Gurugram.బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు
By తోట వంశీ కుమార్ Published on 13 Jun 2021 7:48 AM GMTబంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న హాన్ జున్‌వేను బీఎస్ఎఫ్ గస్తీదళం బెంగాల్ లోని మాల్దా జిల్లాలో శుక్రవారం వేకువజామున పట్టుకున్న సంగతి తెలిసిందే. చైనా ఇంటిలిజెన్స్ సంస్థ కోసం పని చేస్తున్న ఆ దేశ గూఢచారిగా బీఎస్ఎఫ్ విచారణలో వెల్లడైంది. నకిలీ పత్రాలతో వందల సిమ్‌కార్డులు సంపాదించి, వాటిని అక్రమంగా చైనాకు తరలించడంతో పాటు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు.
గురుగ్రామ్ లో 'స్టార్ స్ప్రింగ్' పేరుతో హోటల్ కూడా నిర్వహిస్తున్నాడు.అనేక నకిలీ పత్రాలు సృష్టించి తన సహచరుడితో కలిసి 1300 సిమ్ కార్డులు అక్రమంగా చైనాకు తరలించాడు. వీటితో భారతీయుల బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేయడంతో పాటు ఇతర ఆర్ధిక నేరాలు చేశాడు. అక్రమంగా సిమ్ కార్డులు తరలించాడనే నేరంపై లఖ్నవూ, ఏటీఎస్ లో నమోదైన కేసుల్లో జున్వే మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు. దీంతో భారతీయ వీసా లభించక బంగ్లాదేశ్ బిజినెస్ వీసాతో భారత్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేసి సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ కు పట్టుబడ్డాడు. ఇప్పటికి నాలుగుసార్లు భారత్ కు వచ్చాడు జున్వే. 2010లో హైదరాబాద్ కు వచ్చాడు. అతని వద్ద లభించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని పరిశీలించగా.. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ తరుపున జున్‌వే భారత్‌లో గూఢచారిగా పనిచేస్తున్నట్లు బయటపడినట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.