దారుణం.. భార్య, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన భర్త
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసకుంది. అక్రమ సంబంధాల వ్యవహరాలతో చాలా మంది మధ్య గొడవలు సృష్టిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 1:42 PM ISTదారుణం.. భార్య, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన భర్త
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసకుంది. అక్రమ సంబంధాల వ్యవహరాలతో చాలా మంది మధ్య గొడవలు సృష్టిస్తున్నాయి. కొందరైతే ఏకంగా హత్యలకు పాల్పడుతుంటే.. ఇంకొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా చత్తీస్‌గఢ్‌లో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. బిలాస్‌పూర్‌లో అనుమానంతో భార్యతో పాటు ముగ్గురు పిల్లను దారుణంగా చంపాడు ఓ వ్యక్తి.
సోమవారం రాత్రి బిలాస్‌పూర్‌లోని హరి గ్రామంలో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబంలో అనుమానం పిశాచిలా దాపురించింది. భార్య, భర్త ఉమేంద్ర కేవత్.. ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. భార్య ఓ యువకుడితో చనువుగా ఉంటోందని గ్రహించాడు భర్త. ఆమె అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నారు. అనుమానం కాస్త పెద్దదిగా మారింది. ఇదే విషయంలో దంపతలు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. స్థానికులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కుటుంబ పెద్దలు కూడా ఈ విషయంలో కలుగజేసకుని ఒకట్రెండు సార్లు పంచాయతీ కూడా పెట్టారు. కానీ భర్త ఉమేంద్ర కేవత్ తీరు మారలేదు. అనుమానంతో తరచూ భార్యను తిడుతుండేవాడు.
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ సారి ఘర్షణ మరింత పెద్దది అయ్యింది. క్షణికావేశంలో భర్త ఉమేంద్ర భార్యపై దాడి చేశాడు. పిల్లలు ఏడుస్తుంటే వారిపై కూడా దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా భార్య గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత ముగ్గురు పిల్లల గొంతు కూడా కోసి దారుణ హత్యలు చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ స్థానికులు అరుపులు కేకలు విని ఉమేంద్ర ఇంటికి వెళ్లారు. అప్పటికే ముగ్గురు పిల్లలు, తల్లిని చంపేశాడు. తానూఆత్మహత్య చేసుకోబోతుండగా ఆపారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతులు పిల్లలు ఐదేళ్ల ఖుషీ, నాలుగేళ్ల ఇచ్చా, 10 నెలల కొడుకుగా గుర్తించారు పోలీసులు.