దారుణం.. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఐదుగురి హత్య

చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురిని దారుణంగా చంపారు.

By Srikanth Gundamalla  Published on  15 Sep 2024 1:17 PM GMT
దారుణం.. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఐదుగురి హత్య

డిజిటల్ కాలం నడుస్తోంది. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. అయినా.. చాలా చోట్ల మూఢనమ్మకాలు తొలగిపోలేదు. కొందరు చేతబడులు.. దెయ్యాలు అంటే ఏవేవో మంత్రవిద్యలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఇలాంటివి ఉన్నాయి. అయితే.. తాజాగా చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురిని దారుణంగా చంపారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.

మంత్రవిద్య చేస్తున్నారనే అనుమానంతో సుక్మాలో ఆదివారం ముగ్గురు మహిళలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా హత్య చేశారు. సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ జి చవాన్ తెలిపిన వివరాల ప్రకారం... ఈ కేసులో ముందుగా మావోయిస్టులు చేశారని అనునాలు ఉండేవి. కానీ.. ఐదుగురు నిందితులు లొంగిపోయారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మావోయిస్టుల ప్రమేయం లేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ కిరణ్ చవాన్ చెప్పారు.

కొంటలోని ఎట్కాల్ గ్రామ గ్రామస్థులు.. ఆ గ్రామంలోని ఒక కుటుంబం చేతబడి చేస్తున్నదని, పిల్లలలో ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నారని నమ్మారు. దాంతో గ్రామంలోని కొంతమంది ప్రజలు అనుమానంతో మూసమ్ కన్న (60), మూసమ్ బుచ్చా (34), మౌసం బిరి, కర్క లచ్చి (43), మౌసం అర్జో (32)ను దాడి చేసి చంపేశారు. వారి ఇంట్లోకి ప్రవేశించి ఒకేసారి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయారు. నిందితులు లాఠీలు, గొడ్డళ్లను ప్రయోగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ కేసులో దాడికి పాల్పడ్డ నిందితులను ఏక్తాల్ గ్రామానికి చెందిన సవ్లాం రాజేష్ (21), సవ్లాం హిద్మా, కరమ్ సత్యం (35), కుంజం ముఖేష్ (25), పొడియం ఎకా గా పోలీసులు చెప్పారు. నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారనీ.. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

Next Story