బర్త్‌ డే పార్టీలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆహారంలో మత్తు మందు కలిపి..

బర్త్‌డే పార్టీలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు మరో మహిళ సహాయంతో ఆహారంలో మత్తు మందు కలిపి తినిపించి, స్పృహా కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశారు.

By అంజి  Published on  11 Jun 2024 2:53 AM GMT
Chennai, birthday party, spiked food, Crime news

బర్త్‌ డే పార్టీలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆహారంలో మత్తు మందు కలిపి..

తమిళనాడులోని చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బర్త్‌డే పార్టీలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు మరో మహిళ సహాయంతో ఆహారంలో మత్తు మందు కలిపి తినిపించి, స్పృహా కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11వ తరగతి చదువుతున్న బాలికకు అన్నానగర్‌లోని ఓ కేఫ్‌లో ఓ మహిళతో స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఆ మహిళ పుట్టినరోజు వేడుకల కోసం ఆమెను ఓ అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానించింది. మహిళ సదరు బాలికకు స్పైక్డ్ ఫుడ్ (మత్తు ఆహారం) అందించింది. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.

ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురించి బయటకు చెబితే చంపేస్తానని బాలికను బెదిరించారు. రెండు రోజుల తర్వాత బాలిక అస్వస్థతకు గురికావడాన్ని బాలిక సోదరి గమనించి వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని బయటపెట్టింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమేష్, ప్రతీక్ష అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రస్తుతం విలియమ్స్‌గా గుర్తించిన మూడో నిందితుడి కోసం అధికారులు వెతుకుతున్నారు.

Next Story