తల్లి మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో క‌ప్పేసిన కుమారుడు

Chennai man buries his dead mother in a water barrel.ఓ వ్య‌క్తి త‌న త‌ల్లి మృత‌దేహాన్ని డ్ర‌మ్‌లో పెట్టి సిమెంట్‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 May 2022 1:49 PM IST
తల్లి మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో క‌ప్పేసిన కుమారుడు

ఓ వ్య‌క్తి త‌న త‌ల్లి మృత‌దేహాన్ని డ్ర‌మ్‌లో పెట్టి సిమెంట్‌తో క‌ప్పేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న చెన్నైలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేర‌కు.. చెన్నైలోని నీలాంక‌రై స‌ర‌స్వ‌తి న‌గ‌ర్‌కు చెందిన‌ గోపాల్, షెన్బగం దంప‌తుల‌కు ప్రభు, మురుగన్, సురేష్ సంతానం. గోపాల్‌ గతంలోనే మ‌ర‌ణించ‌గా.. ప్రభు, మురుగన్‌ చెన్నైలో వేర్వేరు ప్రాంతాల్లో కుటుంబాలతో నివాసం ఉంటున్నారు. చిన్న‌కుమారుడు సురేష్‌(50), త‌ల్లి షెన్బ‌గం(86) క‌లిసి ఉంటున్నాడు.

కాగా.. పెద్ద కుమారుడు ప్ర‌భు ఆదివారం సాయంత్రం త‌ల్లిని క‌లిసేందుకు ఇంటికి వ‌చ్చాడు. అయితే.. త‌ల్లి క‌నిపించ‌క‌పోగా సురేష్ అత‌డిని ఇంట్లోకి రానివ్వ‌క‌పోవ‌డంతో ప్ర‌భుకి అనుమానం వచ్చి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సురేష్‌ను ప్ర‌శ్నించ‌గా.. డ్ర‌మ్‌లో త‌ల్లి మృత‌దేహం ఉంద‌ని చెప్ప‌గా అంద‌రూ ఒక్క‌సారిగా విస్మ‌యానికి గురైయ్యారు. ఆ డ్ర‌మ్‌ను ప‌గ‌ల‌కొట్టి పోలీసులు షెన్బ‌గం మృత‌దేహాన్ని వెలికి తీశారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. షెన్బ‌గం అనారోగ్యంతో మ‌ర‌ణించిందా..? అంత్య‌క్రియ‌లు చేయ‌లేని ప‌రిస్థితుల్లో సురేష్ ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడా..? అన్న కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. సురేష్ మాన‌సిక స్థితి స‌రిగా లేద‌ని స్థానికులు చెబుతున్నారు.

Next Story