నడిరోడ్డుపై దారుణం.. భార్యపై భర్త దాడి.. స్పృహ తప్పడంతో..

చెన్నైలోని ఓ వ్యక్తి తన భార్యను బహిరంగంగా కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

By అంజి  Published on  28 April 2024 7:08 PM IST
Chennai man, arrest,  beating

నడిరోడ్డుపై దారుణం.. భార్యపై భర్త దాడి.. స్పృహ తప్పడంతో..

చెన్నైలోని ఓ వ్యక్తి తన భార్యను బహిరంగంగా కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై గురించి తెలుసుకున్న పోలీసులు.. సదరు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. కోయంబేడి వంతెనపై రోషన్ అనే వ్యక్తి, అతని భార్య గొడవపడుతుండడాన్ని ప్రయాణికులు గమనించారు. నిందితుడు ఆమెను పదే పదే కొట్టడంతో స్పృహతప్పి పడిపోయింది.

అటుగా వెళుతున్న ఓ ప్రయాణికుడు తన వాహనాన్ని ఆపి, హెల్మెట్ ధరించి, అపస్మారక స్థితిలో రోడ్డుపై ఉన్న తన భార్యపై దాడి చేసి, పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని వీడియో చిత్రీకరించాడు. పోలీసులు వస్తున్నారని ప్రయాణీకుడు రోషన్‌కు చెప్పడంతో నిందితుడు తన భార్యను రోడ్డుపై నుంచి లేపి ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.

గ్రేటర్ చెన్నై పోలీసులు శనివారం ట్వీట్ చేస్తూ ఆ వ్యక్తిని అరెస్టు చేశామని, ఈ విషయంపై విచారణ కొనసాగుతోంది. "ఈ వీడియోలోని మగ వ్యక్తి రోషన్ , మహిళ అతని భార్య. మహిళపై దాడి చేసినందుకు, ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. రోషన్‌ను అరెస్టు చేసి విచారణ కొనసాగుతోంది" అని పోలీసులు తెలిపారు.

Next Story