విషాదం.. ట్యాంక‌ర్ నుంచి కెమిక‌ల్ లీక్‌.. ఆరుగురు మృతి

Chemical leak Five killed Gujarat Surat Tanker.గుజ‌రాత్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ట్యాంక‌ర్ నుంచి కెమిక‌ల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2022 3:07 AM GMT
విషాదం.. ట్యాంక‌ర్ నుంచి కెమిక‌ల్ లీక్‌.. ఆరుగురు మృతి

గుజ‌రాత్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ట్యాంక‌ర్ నుంచి కెమిక‌ల్ ర‌సాయ‌నం లీకై ఆరుగురు మృతి చెంద‌గా.. మ‌రో 20 మంది అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. ఈ ఘ‌ట‌న సూర‌త్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. సూర‌త్‌లోని సచిన్ జిఐడిసి ప్రాంతంలో ఆగి ఉన్న ట్యాంకర్ నుండి గురువారం తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల స‌మ‌యంలో ర‌సాయ‌నాలు లీకైయ్యాయి. దీంతో ఆరుగురు ఊపిరీ ఆడ‌క ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇర‌వై మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని.. భాధితుల‌ను సూరత్ సివిల్ ఆసుపత్రికి త‌ర‌లించారు.

అస్వ‌స్థ‌త‌కు గురైన వారిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. లీకైన ట్యాంకర్‌ను జెర్రీ కెమికల్‌తో నింపినట్లు సమాచారం. ట్యాంకర్ డ్రైవర్ వ్యర్థాలను డ్రెయిన్‌లో వేయడానికి ప్రయత్నించగా, ఆ రసాయనం గాలికి తాకడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఆ ట్యాంకర్ వడోదర నుంచి వచ్చిందని, డ్రైవర్ అక్రమంగా రసాయన వ్యర్థాలను సచిన్ జిఐడిసి ప్రాంతంలోని డ్రైన్‌లో వేయడానికి ప్రయత్నించ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌మాదం అనంత‌రం ట్యాంక‌ర్ డ్రైవ‌ర్ ప‌రారు అయ్యాడు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ట్యాంక‌ర్ డ్రైవ‌ర్ కోసం గాలింపు చేప‌ట్టారు.

Next Story
Share it