అమ్మాయిలా చాటింగ్.. 70 మంది బాధితురాళ్లు.. ఆతరువాత
Chatting like a girl and then blackmail man arrested by Cyberabad police.ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన అమ్మాయి ఫోటోతో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. యువతిలాగే చాటింగ్ చేసేవాడు.
By తోట వంశీ కుమార్ Published on 3 Feb 2021 10:55 AM ISTఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన అమ్మాయి ఫోటోతో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. యువతిలాగే చాటింగ్ చేసేవాడు. కొన్ని రోజుల తరువాత వారిని నమ్మించి సెక్స్ చాటింగ్ చేసేవాడు. అప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న అర్థనగ్న, నగ్న ఫోటోలు వారికి పంపించేవాడు. వారిని కూడా మీ ఫోటోలు పంపాలని కోరేవాడు. అతడి మోసాన్ని కనిపెట్టలేని వారు అతను చెప్పినట్లుగానే ఫోటోలు పంపేవాడు. ఆ తరువాత ఆఫోటోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. దాదాపు 70 మందిని వేదించాడు. చివరకు ఓ బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులకు పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మణికొండలో ఓ ప్రైవేట్ కంపెనీలో విజయవాడకు చెందిన సుమంత్ జాబ్ చేస్తుండేవాడు. అమ్మాయి ఫోటోతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచాడు. దాని ద్వారా అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేవాడు. అనేక మంది మహిళలు, యువతులను ఆన్‌లైన్ ఫ్రెండ్స్‌గా మార్చుకున్నాడు. అమ్మాయి మాదిరిగానే చాట్ చేయడంతో.. అవతలి వారు కూడా అమ్మాయినే చాట్ చేస్తుందని ఫ్రీగా మాట్లాడేవారు. మెల్లిగా వారిని సెక్స్ చాటింగ్‌లో దింపేవాడు. తరువాత అప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న అర్థనగ్న, నగ్న ఫోటోలను అవతలి వారికి పంపి తనవేనని నమ్మించి.. మీరు కూడా ఇలాంటి ఫోటోలు పంపాలని కోరేవాడు.
కొందరు నమ్మి ఫోటోలను పంపేవారు. ఫోటోలు పంపగానే.. తాను యువకుడిననే విషయం చెప్పి వారిని భయపెట్టేవాడు. నీ ఫోటోలు నాదగ్గర ఉన్నాయి. వాటిని సోషల్ మీడియాలో పెడతాను. తాను చెప్పినట్లే చేయాలని.. తను కోరికలను తీర్చాలని చెప్పేవాడు. ఇలా దాదాపు 70 మందిపైగా బాధితురాళ్ల ఫోటోలు, స్రీన్ షాట్స్‌ను తమ ఫోన్‌లో సేవ్ చేసుకుని వేదింపులకు పాల్పడ్డాడు.
ఓ బాధితురాలు ధైర్యం చేసి.. సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకుని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సై మహిపాల్ బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితుడు ఎక్కడున్నారో గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని అతడి ఫోన్‌ను పరిశీలించగా.. 70 మంది మహిళల ఫోటోలను ఉన్నట్లు గుర్తించారు.