బీటెక్ విద్యార్థిని సూసైడ్.. కలచివేసిందన్న చంద్రబాబు
Chandrababu reaction on Btech student suicide.కాలేజి ధన దాహానికి ఓ విద్యార్థిని బలైంది. కాలేజీ ఫిజులు చెల్లించాలంటూ
By తోట వంశీ కుమార్ Published on 6 Feb 2021 7:37 PM ISTకాలేజి ధన దాహానికి ఓ విద్యార్థిని బలైంది. కాలేజీ ఫిజులు చెల్లించాలంటూ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో బిటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులోని గొడుగుపాలెంకు చెందిన తేజశ్రీ అనే విద్యార్థిని క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె తండ్రి ఓ ముఠా కూలీ. గత ఏడాది తేజశ్రీకి ఫీజురీయంబర్స్ మెంట్ వచ్చింది. అయితే ఈ ఏడాది ఫీజు రీయంబర్స్ మెంట్ రాలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం రూ.35వేలు చెల్లించిన తండ్రి ఇకపై తాను చెల్లించలేనని చెప్పడంతో మనస్థాపానికి గురైంది. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తేజశ్రీ ఆత్మహత్య కు పాల్పడటంతో కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఒంగోలులో బీటెక్ చదువుతున్న విద్యార్థిని తేజస్విని కళాశాల ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నదన్న వార్త తన మనసును కలచివేసిందన్నారు.
ఇది అత్యంత దురదృష్టకరమైన విషయమన్నారు. తల్లిదండ్రులకు చదివించే స్తొమత లేదన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజు రీఇంబర్స్ మెంటు ఏమైంది? అని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారని.. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత నిరాశావాదంతో ప్రాణాలు తీసుకుంటోందన్నారు. తేజస్విని కుటుంబానికి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.