తుపాకీతో కాల్చుకుని.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) కానిస్టేబుల్ గురువారం హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బేగంపేటలోని చికోటీ

By అంజి
Published on : 27 April 2023 2:40 PM IST

CRPF constable,  Hyderabad, suicide

తుపాకీతో కాల్చుకుని.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) కానిస్టేబుల్ గురువారం హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బేగంపేటలోని చికోటీ గార్డెన్‌లోని సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ మహేశ్ చంద్ర నివాసం వద్ద కాపలాగా ఉన్న దేవేంద్ర కుమార్ తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాధితుడు వ్యక్తిగత కారణాల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. కానిస్టేబుల్ డిప్రెషన్‌లో ఉన్నట్లు సమాచారం. కానిస్టేబుల్ ఆత్మహత్యకు సంబంధ బాంధవ్యాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసుల తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.

Next Story