హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానెల్ నిర్వహకుడు అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. బెట్టింగ్ యాప్స్ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు యూట్యూబర్ అన్వేష్ పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్‌లను అనుమతించడం, ప్రకటనల ద్వారా దాని ప్రమోషన్ కోసం అనేక మంది ఉన్నత స్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొంతమంది వ్యక్తుల నుండి రూ. 300 కోట్లు తీసుకున్నారని అన్వేష్ ఒక వీడియోలో పేర్కొన్నాడు.
తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిషోర్, వికాస్‌రాజ్ తదితరులు ఈ స్కామ్‌లో పాల్గొన్నారని వీడియోలో చెప్పాడు. దీంతో పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారనే కారణంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేలా అన్వేష్ వ్యాఖ్యలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన అన్వేష్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.