విషాదం.. వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

Car went into farm well in karimnagar.క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఘోర ప్రమాదం జ‌రిగింది. చినముల్కనూరు శివారులో ఓ కారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2021 1:37 PM IST
విషాదం.. వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఘోర ప్రమాదం జ‌రిగింది. చినముల్కనూరు శివారులో ఓ కారు అదుపు తప్పి బావిలోకి ప‌డింది. క‌రీంన‌గ‌ర్ నుంచి హుస్నాబాద్ వైపు వెలుతుండ‌గా.. చినముల్కనూరు శివారుకు వ‌చ్చే స‌రికి కారు అదుపు త‌ప్పి.. రోడ్డు ప‌క్క‌న ఉన్న వ్య‌వ‌సాయ బావిలోకి దూసుకెళ్లింది. స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. బావిలోంచి కారును వెలికితీసేందుకు య‌త్నిస్తున్నారు. కాగా.. కారులో ఐదుగురు వ్య‌క్తులు ఉన్న‌ట్లు పోలీసులు బావిస్తున్నారు. కారు బావిలో ప‌డి చాలా సమ‌యం కావ‌డంతో వారి పరిస్థితిపై ఆందోళ‌న నెల‌కొంది. ఘటనా స్థ‌లిలో సహాయక చర్యలు కొన‌సాగుతున్నాయి. వారి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story