తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు
Car rams into canal 3 deceased I తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు
By సుభాష్ Published on
4 Dec 2020 6:29 AM GMT

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు జల సమాధి అయ్యారు. వివరాల్లోకి వెళితే.. యానాంకు చెందిన రిటైర్డ్ టీచర్ ప్రసాదరావు, భార్య విజయలక్ష్మి, కుమారుడు సంతోష్ చంద్ర ప్రణీత్ నిశ్చితార్థం ముగించుకొని గురువారం రాత్రి ఏటిగట్టు రహదారిపై యానాం బయలు దేరారు.
వీరు ప్రయాణిస్తున్న కారు కె.గంగవరం మండలం కోటిపల్లి కోట దగ్గర అదుపు తప్పి గోదావరి ఏటి గట్టు రహదారి పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ మృత్యువాత పడ్డారు. అర్థరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. సంతోష్ చంద్ర ప్రణీత్ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు
Next Story