కారు బోల్తా.. భారీగా గంజాయి

Car overturned in Bhadrachalam Ganjai Seized.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గోదావరి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2022 10:57 AM IST
కారు బోల్తా.. భారీగా గంజాయి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గోదావరి బ్రిడ్జి సమీపంలో ఓ కారు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. అయితే పల్టీ కొట్టిన కారులోంచి బయటపడ్డ వస్తువులు చూసి అక్కడున్నవారు షాక్ కు గురైయ్యారు. ఆ కారులో ఏం దొరికిందో తెలుసా.. భారీ మొత్తంలో గంజాయి. కారులో గంజాయి ఉండడంతో స్థానికులు వెంటనే అప్ర‌మ‌త్తం అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అయితే.. అప్ప‌టికే కారు డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు అక్క‌డి నుంచి పారిపోయారు. కారు రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. పోలీసులు కారుతో పాటు గంజాయిని సీజ్ చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు గంజాయిని ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి త‌ర‌లిస్తున్నారు అనే విష‌యంపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story