మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డపక్కనే ఉన్న బావిలో ఓ కారు దూసుకెళ్లడంతో ఆరుగురు జలసమాధి అయ్యారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఛతర్‌పుర్‌ జిల్లా మహారాజ్‌పూర్‌లో చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న మోర ముగ్గురిని స్థానికులు కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

బావిలో ఉన్న ఆరు మృతదేహాలను బయటకు తీశారు. అయితే కారులో 9 మంది ఓ వివాహ వేడుకకు సంబంధించి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు మహరాజ్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జీ జెడ్‌ వై ఖాన్‌ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.సుభాష్

.

Next Story