దైవ‌ద‌ర్శ‌నానికి వెలుతుండ‌గా రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

Car Collided with lorry in Nizamabad District 3 dead.నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2022 11:14 AM IST
దైవ‌ద‌ర్శ‌నానికి వెలుతుండ‌గా రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు యువ‌కులు దుర్మ‌ర‌ణం చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ప్ర‌మాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావ‌డంతో మృత‌దేహాల‌ను కారులోంచి బ‌య‌ట‌కు తీసేందుకు చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింది.

మృతుల‌ను నందిపేట్ మండలం సుభాష్‌నగర్‌కు చెందిన మంద మోహన్, ఉమ్మడి అశోక్, రమేష్‌‌గా గుర్తించారు. వీరు కొండ‌గ‌ట్టు అంజ‌నేయ‌స్వామి ద‌ర్శ‌నానికి వెలుతుండ‌గా ఆర్మూర్ మండ‌లంలోని చేవూర్ స‌మీపంలో జాతీయ‌ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story