రూ.2 కోట్ల సైబర్ మోసం.. మంత్రి అకౌంటెంట్‌ను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నందికి చెందిన అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవ వ‌ద్ద నుంచి 2.08 కోట్ల రూపాయలు వ‌సూలు చేసి మోసం చేశారు సైబ‌ర్ కేటుగాళ్లు

By Kalasani Durgapraveen  Published on  15 Nov 2024 8:31 AM GMT
రూ.2 కోట్ల సైబర్ మోసం.. మంత్రి అకౌంటెంట్‌ను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నందికి చెందిన అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవ వ‌ద్ద నుంచి 2.08 కోట్ల రూపాయలు వ‌సూలు చేసి మోసం చేశారు సైబ‌ర్ కేటుగాళ్లు. ఈ కేసులో నిందితులను ప‌ట్టుకునేందుకు సైబర్ పోలీస్ స్టేషన్‌లోని రెండు బృందాలను మోహరించారు. దీంతో పాటు క్రైం బ్రాంచ్ కూడా విచారణ ప్రారంభించింది. ఏ బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీనిపై ఏ పోలీసు అధికారి కూడా స్పష్టంగా స‌మాచారం చెప్పడం లేదు.

మంత్రి నంద్ గోపాల్ గుప్తాకు రితేష్ శ్రీవాస్తవ అకౌంటెంట్. రెండు రోజుల క్రితం మంత్రి నంది కుమారుడి ఫొటోను సైబర్ నేరగాళ్లు వాట్సాప్ డీపీలో పెట్టారు. అనంతరం అదే వాట్సాప్ ద్వారా రితేష్ మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. అందులో నేను ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ లో ఉన్నాను అని రాసి ఉంది. ఇది నా కొత్త నంబర్, వెంటనే డబ్బు పంపండి. ఈ సమావేశం ఎక్కువ‌సేపు కొనసాగనుంది. నాకు అత్యవసరంగా కొంత డబ్బు కావాలి.. అని సైబర్ దుండగులు మూడు బ్యాంకు ఖాతా నంబర్లను పంపించారు. వాటికి డబ్బు బదిలీ చేయండి అని చెప్పారు. మెసేజ్ చూసిన అకౌంటెంట్ పేర్కొన్న ఖాతాలకు మూడుసార్లు రూ.2.08 కోట్లు బదిలీ చేశాడు. ఈ విషయాన్ని ఆయన ఎవరికీ తెలియజేయలేదు. అయితే కొద్దికాలం త‌ర్వాత‌ మంత్రి కుమారుడి నుంచి తనకు ఎలాంటి సందేశం రాలేదని తెలిసింది. ఈ విషయం తెలియగానే రితేష్ భయపడ్డాడు. మంత్రి నందగోపాల్ గుప్తా నందికి సమాచారం అందడంతో పోలీసు అధికారులకు సమాచారం అందించారు. అనంత‌రం సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సైబర్ పోలీస్ స్టేషన్‌లోని రెండు బృందాలతో పాటు.. క్రైం బ్రాంచ్‌ను నేర‌స్థుల‌ను క‌నుగునేందుకు మోహరించారు. ఏ బ్యాంకుల్లో ఎవరి ఖాతాలకు నగదు బదిలీ జరిగిందనే సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు.

ఈ ఖాతాలు ఎవరి పేర్లతో ఉన్నాయో బ్యాంకు అధికారుల నుండి సమాచారం కోరడంతో పాటు, సంబంధిత ఖాతాను స్తంభింపజేయడానికి ప‌లు చ‌ర్యలు చేప‌ట్టారు. మూలాల ప్రకారం.. సైబర్ నేరగాళ్ల గురించి పోలీసులకు కొంత సమాచారం లభించింది. దీంతో పాటు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారం కూడా వెల్లడైన‌ట్లు నివేదిక‌లు చెబుతున్న‌.. దీనిని ఏ అధికారి ధృవీక‌రించ‌లేదు.

Next Story