లోయలో పడ్డ బ‌స్సు.. ఏడుగురు మృతి

Bus fell into a 150 ft ditch in Raigad. ముంబై పూణె పాత రహదారిపై ఘోర ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

By Medi Samrat  Published on  15 April 2023 8:34 AM IST
లోయలో పడ్డ బ‌స్సు.. ఏడుగురు మృతి

Bus fell into a 150 ft ditch in Raigad


ముంబై పూణె పాత రహదారిపై ఘోర ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రాయ్‌గఢ్‌లోని ఖోపోలి ప్రాంతంలోని షింగ్రోబా ఆలయం వెనుక హైవే నుంచి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. అందుతున్న సమాచారం ప్రకారం బస్సులో 30 నుంచి 35 మంది వరకు ప్ర‌యాణికులు ఉన్నారు. ఖోపోలి ప్రాంతంలో బస్సు లోయ‌లో పడిపోవడంతో ఏడుగురు మరణించారని, 25 మందికి పైగా గాయపడ్డారని రాయ్‌గఢ్ ఎస్పీ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.

బస్సు 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. క్రేన్‌కు తాడు కట్టి బస్సును బయటకు తీస్తున్నారు. ఘటనా స్థలంలో స్థానిక పోలీసులు, అంబులెన్స్, వైద్యుల బృందం, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 20 మందికి పైగా ప్ర‌యాణికుల‌ను రక్షించారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గోరేగావ్ ప్రాంతానికి చెందిన ఓ సంస్థకు సంబంధించిన వ్యక్తులు ఓ కార్యక్రమం నిమిత్తం పూణె వెళ్లి పూణె నుంచి తిరిగి వస్తున్న బస్సులో కూర్చున్నారు.


Next Story