ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప స్వామి భక్తులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు లారీని ఢీకొనడంతో ఇరవై మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఒంగోలులో చోటుచేసుకుంది. ఒంగోలు జాతీయ రహదారిపై ఆదివారం నాడు తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీఆర్ అంబేద్కర్ కోనసీం జిల్లా నుంచి కేరళ రాష్ట్రం శబరిమలకు శయ్యప్ప స్వామి భక్తులతో వెళ్తున్న బస్సు ఒంగోలు సమీపంలో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది భక్తులకు గాయాలు కాగా వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణిస్తున్నారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో టిప్పర్ ను ఢీకొట్టాడని అయ్యప్ప భక్తులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. బీహర్‌లోని సరన్‌లో రోడ్డు పక్కన అంత్యక్రియల విందులో భోజనం చేస్తుండగా అతివేగంతో వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లడంతో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.