ఘోర ప్ర‌మాదం.. నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం పై క‌ప్పు కూలి ఏడుగురి మృతి

Building collapse in thane.మహారాష్ట్రలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. థానే జిల్లాలోని ఉల్హాస్‌న‌గ‌ర్‌లో శుక్ర‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2021 2:26 AM GMT
ఘోర ప్ర‌మాదం.. నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం పై క‌ప్పు కూలి ఏడుగురి మృతి

మహారాష్ట్రలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. థానే జిల్లాలోని ఉల్హాస్‌న‌గ‌ర్‌లో శుక్ర‌వారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఓ ఐదంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెంద‌గా.. మ‌రో ఐదారుగురు శిథిలాల కింద చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, స‌హాయ‌కయ బృందాలు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బ‌య‌ట‌కు తీసేందుకు య‌త్నిస్తున్నారు. ఇప్పటి వరకు భవనం శిథిలాల నుంచి ఏడు మృతదేహాలు వెలికి తీసినట్లు థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పేర్కొన్నారు.

శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఉల్లాస్‌నగర్‌లోని నెహ్రూచౌక్‌ వద్ద ఉన్న ఈ భవనం ఐదో అంతస్థు నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌ వరకు పైకప్పు కూలిపోయింది. రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని.. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో ఖ‌చ్చితంగా తెలియ‌ని అధికారులు తెలిపారు.

Next Story
Share it