ప్రియుడితో వెళ్లిపోయిన వ‌ధువు.. ఆమె చెల్లి మెడ‌లో తాళిక‌ట్టిన వ‌రుడు.. చివ‌ర్లో ట్విస్ట్‌

Bride elopes with boyfriend groom marries her minor sister in Odisha.మ‌రికొద్ది సేప‌టిలో పెళ్లి జ‌రుగుతుంద‌న‌గా..ప్రియుడితో వెళ్లిపోయిన వ‌ధువు.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 19 Feb 2021 5:59 AM

Bride elopes with boyfriend

మ‌రికొద్ది సేప‌టిలో పెళ్లి జ‌రుగుతుంద‌న‌గా.. పెళ్లి కుమారై క‌నిపించ‌లేదు. దీంతో ఆమె కోసం అంద‌రూ వెతుకుతుండ‌గా ఆమె త‌న ప్రియుడితో వెళ్లిపోయింద‌న్న విష‌యం తెలిసింది. నిజం తెలిసిన‌ పెళ్లి కొడుకు బంధువులు నానా ర‌భ‌స చేయ‌డంతో.. పెళ్లి కుమారై చెల్లెల్ని ఇచ్చి వివాహాం జ‌రిపించారు. అయితే.. ఈ విష‌యం పెళ్లి కుమారై అన్న‌య్య‌కు న‌చ్చ‌లేదు. పోలీసుల‌కు కంప్లైట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి వ‌రుడికి ఊహించ‌ని షాక్ ఇచ్చారు. ఈ ఘ‌ట‌న ఒడిషాలోని కల‌హండి ప్రాంతంలో జ‌రిగింది.

జైపట్న పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్ప‌డ గ్రామంలో నివాసం ఉంటున్న కుటుంబంలోని యువతికి వివాహం నిశ్చయమైంది. మ‌రి కొద్దిగంట‌ల్లో పెళ్లి అన‌గా.. ఆమె త‌న ప్రియుడితో పారిపోయింది. ఈ విష‌యం తెలిసి అంతా షాక్ తిన్నారు. పెళ్లి కొడుకు బంధువులు గొడ‌వ చేయ‌డంతో చేసేది లేక‌.. పెళ్లి కుమారై తండ్రి త‌న రెండో కూతురు (15 ఏళ్లు)ను ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ విష‌యంలో ఆ బాలిక అన్న‌య్య.. తండ్రితో గొడ‌వ ప‌డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఛైల్డ్ ఫ్రొటెక్షన్ ఫోర్స్ తో అక్కడకు చేరుకున్నారు.

పదో తరగతి పరీక్షలకు సిద్ధమౌతున్న బాలికను రక్షించి సోదరుడికి అప్ప‌గించారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆ బాలిక కాపురానికి వెళుతుందని.. అప్పటివరకు తన చదువును పూర్తి చేయాలనుకుంటే ఆమె ఇంట్లో లేదా హాస్టల్‌లో ఉండవచ్చని పోలీసులు నిర్ణయించారు. రెండు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.




Next Story