గర్ల్ ఫ్రెండ్ ను చంపడానికి చాలా తెలివిగా ప్లాన్ వేసిన ప్రియుడు

Boyfriend molested girlfriend by writing suicide note.బాలిక హత్య కేసులో ఛత్తీస్‌గఢ్ పోలీసులు షాకింగ్ విషయాలు

By M.S.R  Published on  8 March 2022 6:00 PM IST
గర్ల్ ఫ్రెండ్ ను చంపడానికి చాలా తెలివిగా ప్లాన్ వేసిన ప్రియుడు

బాలిక హత్య కేసులో ఛత్తీస్‌గఢ్ పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఓ యువకుడు తన ప్రియురాలిని హతమార్చేందుకు పక్కాగా ప్లాన్‌ వేశాడు. ముందుగా తన ప్రియురాలు రాసినట్లుగా సూసైడ్‌ నోట్‌ రాసి.. ఆ తర్వాత అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

బాలిక కుటుంబం మార్చి 2న జైజైపూర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ రిపోర్టు చేసింది. అనంతరం పోలీసులు యువతి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇంతలో కొందరు వ్యక్తులు చెరువులో గుర్తు తెలియని బాలిక మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. గత ఫిబ్రవరి 28 నుంచి కనిపించకుండా పోయిన బాలిక మైనర్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా ఆమె దుస్తులలో సూసైడ్ నోట్ లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. బాలికపై అత్యాచారం చేసి గొంతుకోసి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అదే సమయంలో పోస్ట్‌మార్టం రిపోర్టు రావడం.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా గ్రామానికి చెందిన జవహర్ చంద్ర అనే వ్యక్తితో అమ్మాయికి సంబంధం ఉందని తేలింది. అనంతరం పోలీసులు జవహర్‌చంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

ఇటీవల బాలిక తల్లి జవహర్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా పట్టుకుంది. ఆ తర్వాత మొబైల్‌ను కూడా తీసేసుకున్నారని నిందితుడు పోలీసులకు తెలిపారు. దీంతో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలంటూ జవహర్ చంద్రపై బాలిక నిత్యం ఒత్తిడి తెచ్చేది. ఈ సమయంలో అతడు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అమ్మాయి మైనర్‌ కావడంతో పెళ్లి చేసుకుంటే పోలీసులు అదుపులోకి తీసుకుంటారని అతడు భావించాడు. దీంతో పథకం ప్రకారం ఫిబ్రవరి 28న రాత్రి బాలికను చెరువు ఒడ్డున ఉన్న ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి..మొదట సూసైడ్ నోట్ రాయించి, ఆపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశాడు.

Next Story