ప్రియురాలి ఇంటి దగ్గర ప్రియుడు ఆత్మహత్యాయత్నం.. కారణమిదే

ప్రియురాలు ఓ కొత్త టూ వీలర్‌ కొనుక్కుంది. ఆ బైక్‌తో వీధుల్లో చక్కర్లు కొట్టింది. అయితే ఇలా ప్రియురాలు బైక్‌పై తిరుతుండటం

By అంజి  Published on  20 March 2023 5:30 AM GMT
suicide attempt,  Krishna district

ప్రియురాలి ఇంటి దగ్గర ప్రియుడు ఆత్మహత్యాయత్నం.. కారణమిదే

ప్రియురాలు ఓ కొత్త టూ వీలర్‌ కొనుక్కుంది. ఆ బైక్‌తో వీధుల్లో చక్కర్లు కొట్టింది. అయితే ఇలా ప్రియురాలు బైక్‌పై తిరుతుండటం ప్రియుడికి నచ్చలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రియుడు ఆమె ఇంటికి దగ్గరికి వెళ్లి శరీరంపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ఈ ఘటన జరిగింది. యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మార్వాడీ గుడి సమీపంలో నివాసం ఉండే బవర్‌ సింగ్‌ వన్‌టౌన్‌ పీఎస్‌ ఎదుట టీ కొట్టు నడుపుతున్నాడు.

బవర్‌ సింగ్‌ రెండో కొడుకు శైలేష్‌ సింగ్‌ (26) పట్టణానికి చెందిన ఓ యువతితో లవ్‌లో పడ్డాడు. ఇటీవల శైలేష్‌సింగ్‌ ప్రేమిస్తున్న యువతి కొత్త బైక్‌ను కొనుగోలు చేసి వీధుల్లో చక్కర్లు కొట్టింది. ఇది శైలేష్‌సింగ్‌కు ఏమాత్రం నచ్చలేదు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పినా వినలేదు. దీంతో మనస్తాపం చెందిన శైలేష్‌ ఆదివారం నాడు సాయంత్రం తన ప్రియురాలి ఇంటి దగ్గరకు వెళ్లి.. నువ్వు పదే పదే బైక్‌పై తిరిగితే తాను ఆత్మహత్య చేసుకుంటానని యువతిని బెదిరించాడు. యువతి అతడి మాటలు పట్టించుకోపోగా.. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ బదులిచ్చింది.

దీంతో మనస్తాపానికి గురైన శైలేష్‌సింగ్‌ ప్రియురాలి ఇంటిపైన నివాసం ఉండే వారి ఇంటి వద్దకు వెళ్లి శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని వెంటనే అంబులెన్స్‌ సాయంతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా శరీరం కాలిపోయిన శైలేష్‌సింగ్‌ పరిస్థితి విషమించంతో న్యాయమూర్తి అతని నుంచి మరణ వాంగ్మూలం సేకరించారు. మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.

Next Story