విషాదం.. ఊయల తాడు మెడకు బిగుసుకుని 13 ఏళ్ల బాలుడు మృతి

మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు తమ ఇంట్లో తన చెల్లెలుతో ఆడుకుంటున్న సమయంలో ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  19 Jan 2025 2:35 PM IST
Madhyapradesh, Bhopal, swing rope, playing, Bhopal

విషాదం.. ఊయల తాడు మెడకు బిగుసుకుని 13 ఏళ్ల బాలుడు మృతి

మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు తమ ఇంట్లో తన చెల్లెలుతో ఆడుకుంటున్న సమయంలో ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అర్జున్ తన సోదరిని ఊపుతుండగా ఈ ఘటన జరిగింది. హౌస్ హెల్ప్‌గా పనిచేస్తున్న అతని తల్లి సంఘటన సమయంలో ఇంట్లో లేరని ఎంపీ నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) జైహింద్ శర్మ తెలిపారు. అమ్మాయి ఏడవడంతో అర్జున్ ఆమెను ఊయల మీద పడుకోబెట్టి చుట్టూ తిప్పడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో స్వింగ్ వేగంగా తిరుగుతూ అర్జున్ మెడ అందులో ఇరుక్కుపోయిందని శర్మ తెలిపారు.

దీంతో మెడకు తాడు బిగుసుకుపోవడంతో ఊపిరాడక స్పృహతప్పి పడిపోయాడు. పక్కనే ఉన్న ఓ చిన్నారి స్పృహ తప్పి పడిపోయిన అర్జున్‌ని చూసి పక్కనే ఆడుకుంటున్న అన్నయ్యకు సమాచారం అందించాడు. అర్జున్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అర్జున్ కుటుంబానికి ఎలాంటి ఫౌల్ ప్లే అనుమానం లేదు. శనివారం అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Next Story