బాలీవుడ్ నటిపై అత్యాచారయత్నం.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఓ బాలీవుడ్ నటి లైంగికంగా వేధింపులకు గురయ్యింది. దీంతో ఆమె ఫైనాన్సర్‌పై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ముంబై

By అంజి  Published on  14 April 2023 11:43 AM IST
Bollywood actress, Crimenews, Mumbai Police

బాలీవుడ్ నటిపై అత్యాచారయత్నం.. కేసు నమోదు చేసిన పోలీసులు

దేశంలో మహిళలపై నేరాలు ఆగడం లేదు. సామాన్య మహిళల నుంచి సెలబ్రిటీల వరకు మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ నటి లైంగికంగా వేధింపులకు గురయ్యింది. దీంతో ఆమె ఫైనాన్సర్‌పై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు జుహు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వీడియో కోసం డబ్బు ఇస్తానన్న నెపంతో నిందితుడు నటిని వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నటి అడ్డు చెప్పడంతో.. నిందితుడు ఆమెను దూషించడం ప్రారంభించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. నటిపై అత్యాచారం చేయబోయాడు. ఆ విషయానికి వస్తే నిందితుడు నటికి హత్య బెదిరింపు కూడా ఇచ్చాడు. ముంబై పోలీసులు ఐపీసీ 354, 506,509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు సున్నితత్వం కారణంగా, ముంబై పోలీసులు ఇంకా నటి లేదా నిందితుడి గుర్తింపును వెల్లడించలేదు.

Next Story