నదిలో శవమై కనిపించిన నవవధువు.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి..

Body of newly married woman found in Kalaburagi. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైన నవ వధువు నదిలో శవమై కనిపించిన ఘటన

By అంజి
Published on : 17 Dec 2022 5:05 PM IST

నదిలో శవమై కనిపించిన నవవధువు.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి..

కాలేజీకి వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైన నవ వధువు నదిలో శవమై కనిపించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లాలో చోటుచేసుకుంది. కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి వెళ్లిన నవ వధువు నదిలో శవమై కనిపించింది. ఈ సంఘటన కమలాపూర్ తాలూకాలోని కురికోటలో కలకలం రేపింది. మృతురాలు నవదగి గ్రామానికి చెందిన సృష్టి మారుతి (21)గా గుర్తించారు. డిగ్రీ ఐదో సెమిస్టర్ చదువుతున్న సృష్టికి ఇటీవలే వివాహమైంది. అత్తగారి ఇంట్లో ఉండి చదువుకుంటున్న సృష్టి డిసెంబర్ 13న కాలేజీకి వెళతానని చెప్పింది.

సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై గ్రామమంతా వెతికారు. అంతే కాదు బంధువులు, సృష్టి స్నేహితురాళ్లకు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సృష్టి భర్త కుటుంబ సభ్యులు డిసెంబర్ 14వ తేదీ ఉదయం మహాగావ్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత తన ఇంటి నుంచి కనిపించకుండా పోయిన సృష్టి కూరికోట వంతెన సమీపంలో శవమై కనిపించింది.

సమాచారం అందుకున్న వెంటనే మహగావ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అది ఆత్మహత్యా లేక మరేదైనా అనేది విచారణ తర్వాతే తెలియాల్సి ఉంది.

Next Story