బెంగళూరులోని తిలక్ నగర్ ప్రాంతంలో శనివారం ఆగి ఉన్న ఆటోరిక్షాలో 35 ఏళ్ల మహిళ మృతి చెంది కనిపించడం కలకలం రేపింది. దీనిని హత్య కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళను సల్మాగా గుర్తించారు, ఆమె ఒక వితంతువు. నలుగురు పిల్లల తల్లి. ఆమెను వేరే చోట చంపి, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఆటోలో ఉంచారని పోలీసులు భావిస్తున్నారు.
"ఫోరెన్సిక్ నిపుణులు, తిలక్ నగర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు" అని అధికారులు తెలిపారు, మృతదేహాన్ని పోస్ట్ మార్టం పరీక్ష కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఈ హత్యకు గల కారణం, నిందితులను గుర్తించినట్లు డీసీపీ (సౌత్ ఈస్ట్) సారా ఫాతిమా ధృవీకరించారు. "మరణించిన సల్మా (35) నలుగురు పిల్లలతో కూడిన వితంతువు. కారణం, నిందితులు ఎవరో తెలుసు. హత్య కేసు నమోదు చేయబడి దర్యాప్తు జరుగుతోంది" అని అధికారి తెలిపారు. నిందితుడిని పట్టుకుని అరెస్టు చేయడానికి తిలక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.