దారుణం.. బీచ్ సమీపంలో మృతదేహం.. 7 ముక్కలై కనిపించడంతో..

ముంబైలో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తిని ఏడు ముక్కలుగా నరికిన ఘటన కలకలం రేపింది.

By అంజి  Published on  12 Nov 2024 6:57 AM IST
Mumbai beach, Crime, dead body

దారుణం.. బీచ్ సమీపంలో మృతదేహం.. 7 ముక్కలై కనిపించడంతో..

ముంబైలో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తిని ఏడు ముక్కలుగా నరికిన ఘటన కలకలం రేపింది. గోరాయ్ బీచ్ సమీపంలో ప్లాస్టిక్ సంచుల్లో ఏడు ముక్కలుగా ఉన్న వ్యక్తి మృతదేహాన్ని ముంబై పోలీసులు సోమవారం నాడు కనుగొన్నారు. ఆ వ్యక్తి వయస్సు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, అతడి గుర్తింపు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి దుర్వాసన రావడంతో ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా ఆ వ్యక్తి మృతదేహాన్ని ఏడు ముక్కలుగా నరికి నాలుగు ప్లాస్టిక్‌ సంచులలో ఉంచారు. ప్లాస్టిక్ బ్యాగుల్లో వ్యక్తి శరీరంపై బట్టలు, చేతిపై పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని శరీర భాగాలను ప్లాస్టిక్ సంచుల్లో ఎలా చుట్టి ఉంచారో వారు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడి బంధువులను కూడా గుర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story