దారుణం.. కనుగుడ్లు పీకేసీ, చిత్రహింసలకు గురి చేసి.. బీజేపీ నాయకుడి కుమార్తె హత్య
BJP Leader Daughter found hanging tree in Jharkhand.జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికను
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2021 10:14 AM ISTజార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికను కొందరు దారుణంగా హత్య చేశారు. కనుగుడ్లు పీకేసీ, చిత్రహింసలకు గురి చేసి.. అనంతరం చెట్టుకు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. చనిపోయిన బాలికను బీజేపీ నాయకుడి కుమారైగా గుర్తించారు. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన బాలిక.. పలాము జిల్లాలోని లాలిమటి అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పలాము జిల్లాలోని బుద్ధబార్ గ్రామానికి చెందిన ఓ బీజేపీ నాయకుని 16 ఏళ్ల కుమారై ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఐదుగురు సంతానంలో ఆమె చిన్నది. ఈ నెల 7న (సోమవారం) ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపు అయినప్పటకి ఆమె ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు చుట్టు ప్రక్కలా వెతికారు. ఆ యువతి ఆచూకి లభ్యం కాకపోవడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో చున్నీతో చెట్టుకు వేలాడదీసి ఉన్న ఓ మైనర్ బాలికను గుర్తించిన లాలిమటి అటవీ ప్రాంత గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆ మృతదేహాం తప్పిపోయిన యువతిదిగా గుర్తించి.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఉరివేయడానికి ముందే తీవ్రంగా హింసించారని, కుడి కన్నును శరీరం నుంచి వేరు చేశారని పోలీసులు తెలిపారు. ఆమెపై లైంగికదాడి జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నామని చెప్పారు.
బాలిక హత్యకు గురైన ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డుల ఆధారంగా.. ఈ హత్య కేసులో ప్రదీప్ కుమార్ సింగ్ ధనుక్(23) ను అరెస్ట్ చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ నివేదిక కోసం వేచి చూస్తున్నామని, నిందితుడిని ప్రశ్నిస్తున్నామని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పలాము పోలీస్ సూపరింటెండెంట్(ఎస్పీ) సంజీవ్ కుమార్ తెలిపారు.