విద్యార్థి మృతి కారణం అయిన బిర్యానీ
నారాయణ కాలేజ్ ఇంటర్ విద్యార్థి బిల్డింగ్ పై నుండి జారి కింద పడి మృతి చెందాడు.
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 2:39 PM IST
నారాయణ కాలేజ్ ఇంటర్ విద్యార్థి బిల్డింగ్ పై నుండి జారి కింద పడి మృతి చెందాడు. ఓ విద్యార్థి నారాయణ కాలేజ్ క్యాంపస్ లో చదువుతూ.. చేసిన ఓ చిన్న తప్పు వల్ల అతని జీవితమే ముగిసింది. ఆ పిల్లాడి తప్పు తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
కడప జిల్లా రైల్వే కోడూరు కు చెందిన శివకుమార్ రెడ్డి మాదాపూర్ లోని నారాయణ కాలేజ్ వర్మ వన్ క్యాంపస్ లో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లవాడిని హాస్టల్లో వదిలి వెళ్లిన కొన్ని గంటలకే.. మీ అబ్బాయి బిల్డింగ్ పై నుండి కింద పడిపోయాడు అంటూ.. తల్లిదండ్రు లకు ఫోన్ వచ్చింది. హాస్టల్ కి చేరుకున్న తల్లిదండ్రులకు కొడుకు మృతదేహం కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
అయితే హాస్టల్ కు చేరుకున్న శివకుమార్ కు బిర్యాని తినాలనిపించింది. హాస్టల్ సిబ్బందికి తెలియకుండా శివకుమార్ ఐదవ అంతస్తు కిటికీలో నుండి కిందకు దిగేందుకు ప్రయత్నం చేయశాడు. శివకుమార్ కాలుజారి కింద పడిపోవడంతో అతనికి తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.