బర్త్ డే పార్టీ ఫుడ్ బిల్ కోసం గొడవ.. చివరికి..?

బర్త్ డే పార్టీ కాస్తా ఓ వ్యక్తి ప్రాణాలు పోయేలా మారింది. 10,000 రూపాయల బిల్లుకు సంబంధించిన గొడవ కారణంగా.. ఏకంగా ప్రాణాలు

By అంజి  Published on  6 Jun 2023 4:30 PM IST
Birthday party, Mumbai, food bill, Crime news

బర్త్ డే పార్టీ ఫుడ్ బిల్ కోసం గొడవ.. చివరికి..? 

బర్త్ డే పార్టీ కాస్తా ఓ వ్యక్తి ప్రాణాలు పోయేలా మారింది. 10,000 రూపాయల బిల్లుకు సంబంధించిన గొడవ కారణంగా.. ఏకంగా ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లాయి. 20 ఏళ్ల యువకుడి పుట్టినరోజు వేడుకల్లో జరిగిన గొడవ అతడి ప్రాణాలు తీసింది. నలుగురు స్నేహితులు కలిసి ఆ వ్యక్తిని చంపేశారు. ఈ ఘటన గత వారం ముంబైలోని గోవండిలోని బైగన్‌వాడి ప్రాంతంలో జరిగింది. నిందితుల్లో ఇద్దరు అహ్మదాబాద్‌కు చెందిన షారుక్‌, నిషార్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు మరో ఇద్దరు మైనర్‌ నిందితులను జువైనల్‌ హోంకు తరలించారు.

బాధితుడు షబ్బీర్ అన్సారీ మే 31న రోడ్డు పక్కన ధాబా లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. అక్కడ బిల్లు దాదాపు రూ. 10,000 అయింది. నలుగురు నిందితులు షబ్బీర్ అన్సారీకి డబ్బు తర్వాత ఇస్తామని చెప్పడంతో షబ్బీర్ అన్సారీ ఫుడ్ బిల్లు చెల్లించి ఇంటికి తిరిగి వచ్చాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో, షబ్బీర్ అన్సారీ తన డబ్బు కోసం నిందితులకు ఫోన్ చేశాడు. తాము డబ్బులు ఇచ్చేది లేదని వాళ్లు చెప్పారు. ఏమి చేసుకుంటావో చేసుకో అని బెదిరించారు. అనంతరం షబ్బీర్ అన్సారీ అక్కడి నుంచి వెళ్లి సంఘటన గురించి తన మరో స్నేహితుడికి తెలియజేశాడు.

ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో శివాజీ నగర్‌ ప్రాంతంలో షబ్బీర్ అన్సారీ తన ఇతర స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో నిందితులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షబ్బీర్ అన్సారీని ఇష్టమొచ్చినట్లు తిట్టి దాడికి తెగబడ్డారు. వారు పదునైన ఆయుధంతో షబ్బీర్ అన్సారీపై దాడి చేశారు, అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శివాజీ నగర్ పోలీసులు నిందితులపై ఐపీసీ 302,323,109, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Next Story